ప్రతిరోజూ ఉదయం చేమంతి పూలతో చర్మాన్ని సున్నితంగా మర్దన చేయాలి. ఇలా కొన్ని రోజులపాటు చేస్తే చర్మం మీది ముడతలు పోతాయి.
మీ చర్మం చిట్లి బిరుసెక్కినట్లుగా ఉంటే చర్మానికి పెరుగు రాయండి. 30 నిమిషాల తర్వాత స్నానం చేయండి.
జుట్టు మెరవాలంటే కోడిగుడ్డు సొనను, అరటి పండును బాగా కలిపి పేస్టులా చేసుకోవాలి. ఆ పేస్టును తలకు రాసుకోవాలి. 25 నిమిషాల తర్వాత మైల్ట్ షాంపూతో తలస్నానం చేయాలి.
జుట్టు వెనకకు దువ్వడానికి వీలులేకుండా ఉంటే నిమ్మరసాన్ని నీళ్లలో కలిపి తలకు రాసుకోవాలి. ఆ తర్వాత దువ్వుకోవాలి.
ఎర్రగా ఉన్న జుట్టు నల్లగా మారాలంటే, జుట్టు రాలడాన్ని ఆపాలంటే ఆపిల్ జ్యూస్, నీరు కలిపి తలకి రాసుకోవాలి. ఆరిన తరువాత తల స్నానం చేయాలి.