కరువు పరిస్థితులను తట్టుకొని తక్కువ సమయంలోనే అధిక దిగుబడి ఇచ్చే కంది వంగడాలను ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సాధారణ కందుల పంట కాలం 180 రోజులు కాగా, 40-50 రోజుల వ్యవధిలోనే పంట చేతికి వచ్చేలా కొత్త రకం వంగడాలను అందుబాటులోకి తెచ్చారు. ఇవి తక్కువ నీటి లభ్యత, తెగుళ్లను తట్టుకొనే సామర్థ్యం 50 శాతం అధికంగా కలిగి ఉంటాయి. 2050 నాటికి 1400-1600 కిలోల దిగుబడి సాధించేలా ఐసీపీహెచ్ 2433, 2431, 2429, 2438 రకాలను అభివృద్ధి చేయనున్నారు.