ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థుల వసతి, భోజనం ఖర్చుల కోసం రూ.1000 కోట్లు ఖర్చు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విద్యార్థులకు బలవర్థకమైన ఆహారం అందించడంలో భాగంగా మార్చి 2 నుండి మధ్యాహ్న భోజనంలో రాగి జావను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాగిజావను వారానికి మూడు రోజుల పాటు అందించేందుకు రూ.86 కోట్లను అదనంగా ఖర్చు చేయనుంది.