ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అభద్రతా భావంలో ఉన్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో నాయకులు, ఫోన్లు మాట్లాడుకునే ధైర్యం చేయలేకపోతున్నారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ఘటనపై ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరిగితే మిగిలిన వారి విషయాలు బయటపడతాయని ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్నట్లు ఆరోపించారు. మేయర్ తో సహా 11 మంది కార్పొరేటర్లు తనతో ఉన్నారని కోటంరెడ్డి తెలిపారు.