మంగళగిరి నగరంలో త్రాగు నీటి సరఫరాలకు అంతరాయం ఏర్పడినట్లు కార్పోరేషన్ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పైప్ లైన్లలో వచ్చిన లీకేజ్ కారణంగా సమస్య ఉత్పన్నమైందని అందుమూలంగా 9వ తేదీ గురువారం మధ్యాహ్నం నుండి శుక్రవారం మధ్యాహ్నం వరకు మంగళగిరి నగరంలో త్రాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు నగరపాలక సంస్థ డీఈ కృష్ణారెడ్డి తెలిపారు. సమస్య పరిష్కరించేందుకు పైప్ లైన్ల మరమ్మత్తుల కోసం నాలుగు ఇంజన్లను వినియోగిస్తున్నామని శుక్రవారం మధ్యాహ్నం నుండి యధావిధిగా నీటి సరఫరా పునరుద్ధరించడం జరుగుతుందని తెలిపారు. కావున ప్రజలు గమనించి త్రాగునీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.