మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రజ్ఞ రాజీవ్ సతావ్‌పై దాడి జరిగింది. కస్బే ధావండా గ్రామంలో బుధవారం ఓ బహిరంగ సభకు ఎమ్మెల్సీ ప్రజ్ఞ హాజరై ప్రసంగించారు. ఆ సమయంలో మహేంద్ర డొంగార్‌దివ్ (40) అనే వ్యక్తి వేదికపైకి వెళ్లి, ఎమ్మెల్సీని చెంప దెబ్బ కొట్టాడు. ఈ పరిణామంతో ఎమ్మెల్సీ షాక్ అయ్యారు. ఎమ్మెల్సీ ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa