కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక తేరుబజార్ సమీపంలోని సోమేశ్వర టాకీస్ నందు శుక్రవారం ఉదయం ఆటో డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల రెండు ఆటోలు ఢీకొన్నాయి.ప్రమాదం నుంచి కూలీలు బయటపడ్డారు. ఒకరి తలకు కాస్త గాయాలు కావడంతో పెనుప్రమాదం తప్పింది.పరిమితి మించి ఆటోలలో ప్రయాణం చిన్న ఆటోలలో నలుగురు,పెద్ద ఆటోలలో ఏడుగురు ఎక్కాల్సిఉన్నా డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తున్న పట్టించుకునే వారు కరువయ్యారు. దీంతో ఇష్టానుసారంగా రోడ్ల పై రూల్స్ పాటించకుండా ఫోన్లలో మాట్లాడుకుంటూ ఆటోలను నడుపుతున్నారు.