నేడు షార్ నుండి మరో ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. చిన్న ఉపగ్రహ వాహననౌక SSLV D2 ఉదయం 9.18 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. నేడు తెల్లవారుజామున 2.48 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ ఉదయం 9.18 గంటలకు ముగియనుంది. ఈ ప్రయోగం ద్వారా ఇస్రోకి చెందిన EOS-07, US అటారిక్ సంస్థకు చెందిన జూనుస్-1, చెన్నై స్పేస్ కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో రూపొందిన ఆజాదీశాట్-2 ఉపగ్రహాలను నింగిలోని పంపనున్నారు.