విశాఖ నగరంలోని తెలుగు తల్లి ఫ్లైఓవర్ వంతెన పై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎలమంచిలి ప్రాంతానికి చెందిన కామేష్ (35) ద్విచక్ర వాహనం ఫై సిరిపురం సంపత్ వినాయక టెంపుల్ నుండి తెలుగు తల్లి ప్లేఓర్ వంతెన మీదుగా విశాఖ రైల్వే స్టేషన్ వైపుగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి సమీపంలో పూల కుండీలను ఢీకొన్నాడు. దీంతో అతడి తలకి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.