విశాఖపట్నం: వివాహిత అధృశ్యంపై పరవాడ పోలీస్స్టేషన్లో గురువారం కేసు నమోదు చేసారు. పోలీసుల కథనం మేరకు. కన్నూరు పంచాయితీ మడకపాలెం గ్రామానికి చెందిన మడక రాముతో పెదముషిడివాడ శివారు గండివానిపాలెం గ్రామానికి చెందిన దేవి(30)కి కొన్నేళ్ల క్రితం వివాహమయింది. వీరిద్దరూ కొంత కాలంగా పెదముషిడివాడ పంచాయితీ మార్కండేయనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. గత కొద్దరోజలుగా దేవి ప్రవర్తన సరిగా లేకపోవడంతో దంపతుల నడుమ విబేదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపద్యంలో వారం రోజుల క్రితం దేవి గండివానిపాలెం తన పుట్టింటికి వెళ్లింది. తల్లిదండ్రులు కూడా భర్త వద్దకు వెళ్లాలని ఆమెకు సర్దిచెప్పడంతో ఈ నెల 7వ తేదీన సాయంత్రం 5గంటల సమయంలో ఆమె పుట్టింటి నుంచి అదృశ్యమైంది. ఆమె కోసం ఎంతగాలించినా ఫలితం లేకపోవడంతో గురువారం కుటుంబ సభ్యులు పోలీస్స్టేషన్లో పిర్యాదు చేసారు. ఈ మేరకు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.