తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాలల్లో విద్యార్థులు 5వ తరగతిలో ప్రవేశం పొందేందుకు మార్చి 6 లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 23న అన్ని జిల్లాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఇంగ్లీష్ మీడియంలో బోధన, వసతి సౌకర్యం కల్పిస్తారు. వివరాలకు
http://tswreis.ac.in/,
http://tgtwgurukulam.telangana.gov.in వెబ్ సైట్స్ చూడాలని అధికారులు సూచించారు.