2011 నుంచి ఇప్పటి వరకు మొత్తం 16 లక్షల మందికిపైగా భారతీయులు భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వీరిలో ఒక్క 2022 సంవత్సరంలోనే అత్యధికంగా 2.25 లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదిలిపెట్టారని వివరించింది. విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు.