శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐగా ఈరన్న శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఉన్న సిఐ ఇస్మాయిల్ విఆర్ కు వెళ్లడంతో ఇక్కడ సిఐ పోస్ట్ కాళీగా ఉంది. దీంతో జిల్లా అడిషనల్ డీజీ ఆదేశాల మేరకు అనంతపురం వి ఆర్ లో ఉన్న ఈరన్నను హిందూపురం వన్ టౌన్ సిఐ అటాచ్డ్ గా నియమించారు. దింతో ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ పట్టణంలో ఆస్థాన్య కార్యకర్త వేస్తామని, మట్కా, జూదం, బెట్టింగ్, గ్యాంబ్లీంగ్ లాంటి వాటి నిర్మూలనకు ఉక్కు పాదం మోపుతానన్నారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే తనకు సమాచారం ఇవ్వాలన్నారు.