ఏటా మార్చి వస్తే చాలు పిల్లలకు పరీక్షల టెన్షన్ మొదలవుతుంది. అయితే, తల్లిదండ్రులే పిల్లల్లో ఒత్తిడిని తగ్గించవచ్చని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. తల్లిదండ్రులు ముఖ్యంగా ఇతరులతో పోల్చడం, పదే పదే మార్కుల గురించి ప్రస్తావించడం చేయకూడదని పేర్కొంటున్నారు. వారి శక్తికి మించి లక్ష్యాలు నిర్దేశించకూడదు. పిల్లలు తగిన విశ్రాంతి తీసుకునేలా, డిప్రెషన్ కు గురి కాకుండా బాధ్యతగా చూడాలని సూచిస్తున్నారు.