పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని(16) రెండు రోజుల కిందట ఫోన్ మాట్లాడుతుండగా తండ్రి మందలించాడు. దీంతో ఆమె డాబా ఎక్కి ఫోన్ మాట్లాడుతుండగా తండ్రి చూశాడు. ఎవరో యువకుడితో మాట్లాడుతుందని అనుమానించి ఆమె గొంతు పట్టుకొని కిందికి తోశాడు. దీంతో విద్యార్థిని తీవ్రంగా గాయపడగా గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తండ్రిని అరెస్టు చేశారు.