ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ఫథకాల డబ్బులను వచ్చే త్రైమాసికం నుండి పెళ్లి కూతుళ్ల తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం జగన్ తెలిపారు. దీంతో పిల్లలు కనీసం టెన్త్ వరకు చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారని, మహిళలు చదువు బాట పడితేనే సమాజం బాగుంటుందని సీఎం పేర్కొన్నారు. పెళ్లి కోసం ఆగొచ్చు కానీ, చదువు కోసం ఆగకూడదని జగన్ అభిప్రాయపడ్డారు.