ప్రస్తుత రోజుల్లో చిన్నపాటి విషయాలకే హత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన యూపీలో చోటుచేసుకుంది. బులంద్‌షహర్‌లోని సయానా కొత్వాలి ప్రాంతంలోని వైరా ఫిరోజ్‌పూర్ గ్రామానికి చెందిన సంజయ్ అనే వ్యక్తిని కత్తులతో దారుణంగా పొడిచి చంపారు. అయితే చిన్నపాటి వివాదానికే ఈ దారుణానికి పాల్పడ్డట్లు సమాచారం. పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.