ఫేమస్ పంజాబీ డిష్ రాజ్మా చావల్‌లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రాజ్మా లేదా కిడ్నీ బీన్స్ ప్రొటీన్‌కు పవర్ హౌస్ కాకుండా వీటిలో మినరల్స్, విటమిన్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో అధిక బరువును నియంత్రించడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రాజ్మాలో పుష్కలంగా ఉండే పొటాషియంతో కడుపుబ్బరం, వికారం వంటి ఇబ్బందులనూ అధిగమించవచ్చు.