అప్పుడే వేసవికాలం వచ్చేసినట్లు ఎండ అదరగొడుతుంది. రాత్రి సమయంలో చల్లగా ఉన్నా...పగటిపూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇవి క్రమేపీ పెరిగి ఏప్రిల్ నాటికి అధికమైన ఎండలు కాస్తాయి. ఆ తరువాత కూడా వేసవి తీవ్రత పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం పసిఫిక్ మహా సముద్రం ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు! ప్రస్తుతం -0.4తో ఉన్న ‘లానినా’...ఏప్రిల్ నాటికి బలహీనపడి +0.1కు మారుతుంది. ఆ తరువాత జూలై నాటికి +6గా నమోదై బలహీనమైన ఎల్‌నినో దశకు చేరుకుంటుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.