తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ పాదయాత్రలో వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కొడాలినాని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఇకపై మా నాయకుడిపై మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హిందూపురం పార్లమెంట్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ తోటవాసుదేవ, తెలుగుయువత, టీఎన ఎస్‌ఎఫ్ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు తిరుమలేశ, ఇర్షాద్ హెచ్చ రించారు. టీడీపీ స్థానిక కార్యాలయంలో విలేకరుల సమావేశం లో వారు కొడాలినానిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నారాలోకేశ 400 రోజులు 4వేల కిలోమీటర్ల యువగళం పాద యాత్ర చేపడితే వైసీపీ నేతలు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే లోకేశ పాదయాత్రతో వైసీపీనేతల గుండెల్లో వణుకు పుట్టిందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. అదేవిధంగా కొడాలినాని కూడా నారాలోకేశపై విమర్శలు గుప్పిస్తున్నారని, ఇకపై మానుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని హెచ్చ రించారు. అమరావతి రాజధానిపై ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందన్నారు. పార్లమెంట్ సమావేశా ల్లో ఏపీ ఏకైక రాజధాని అమరావతే అని తేల్చారని, కానీ ముఖ్యమం త్రి జగన అమరావతి కాదని విశాఖ పట్నం అని అంటున్నారని అన్నారు. ఒక పక్క సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని విషయంపై చర్చ జరుగు తుండగా, కానీ కనీసం కోర్టుల మీద గౌరవంలేకుండా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తీరు ఉందని విమర్శించారు.ఈ కార్యక్రమంలో ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు మందల సురేశ, నాయకులు బొగ్గువినోద్, హరి, రామ్మోహన పాల్గొన్నారు.