కడప జిల్లా, జమ్మలమడుగు మండలంలోని కన్యతీర్థం-సున్నపురాళ్లపల్లె గ్రామాల మధ్య వైఎ్‌సఆర్ స్టీల్‌ప్లాంట్ శిలాఫలకం ప్రాంగణంలో భూమిపూజకు శనివారం నుంచి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఇటీవల ఏపీ హైగ్రేడ్ స్టీల్‌ప్లాంట్ ఎండీ షన్మోహన్, కలెక్టర్ విజయరామరాజు, జాయింట్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ, జిల్లాలోని ఇతర అధికారులు సందర్శించి పరిశీలించారు. ఈ నెల 15వ తేదీన సీఎం జగన్మోహన్రెడ్డి వైఎ్‌సఆర్ స్టీల్‌ప్లాంట్ శిలాఫలకం వద్ద భూమిపూజ చేయుటకు రానున్నట్లుగా ఆ దిశగా ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఈ భూమిపూజకు అధికారులు దూరంగా ఉండే అవకాశం ఉందని స్థానిక అధికారుల ద్వారా తెలుస్తోంది. ఏదేమైనా ఈ నెల 15వ తేది నాటికి ఆర్అండ్బీ ఈఈ నరసింహారెడ్డి, ఇతర అధికారులు హెలిప్యాడ్, భూమిపూజకు సంబంధించిన ఏర్పాట్లు, గ్రావెల్ రోడ్లు, కంపచెట్లు తొలగించి భూమి చదును చేశారు. ఆ దిశగా దగ్గరలో ఉన్న ఎర్రమట్టి గ్రావెల్‌ను టిప్పర్ల ద్వారా స్టీల్‌ప్లాంట్ శిలాఫలకం ప్రాంతంలో తరలించి ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి.