ఎస్సీ రైట్స్ ప్రొ టెక్షన్ సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్మలపాటి దివాకర్‌బాబు, జైబీం మాలమహాసేన అధ్యక్షుడు పల్లెకొండు సంపత్ ఆధ్వర్యంలో కడప జిల్లా, ఎర్రముక్కపల్లె ఆర్టీసీ బస్టాండు, అంబేడ్కర్ విగ్రహం ఎదుట శని వారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దళితుడు ఉన్నత స్థాయికి చేరుకోవడాన్ని జీర్ణించుకోలేక కక్షపూరితంగా ఎంపీ రఘురామకృష్ణమ రాజు, సునీల్‌కుమార్ ఐపీఎ్‌సపై హిందూ వ్యతిరేకి అని కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయించి ఆయన ఉన్నత స్థితిని అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. నిబద్దదత, నిజాయితీ కలిగిన అధికారి పీవీ సునీల్ అని చెప్పారు. తక్షణం దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఈఆర్ పీఎస్ జిల్లా అధ్యక్షుడు వై.శేకర్, జైబీం మాలమహాసేన ప్రధాన కార్యదర్శి చైతల్య, లావణ్య, శ్యాంసన్, జాషువా తదితరులు పాల్గొన్నారు.