కేంద్ర టెలి కమ్యూనికేషన్ శాఖ మంత్రి దేవ్శిన్హా చౌహన్ శనివారం రాత్రి కర్నూలుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు జిల్లా అధ్యక్షులు పోలంకి రామస్వామి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి పార్థసారథి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాఘవేంద్రలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆదివారం నుంచి రెండు రోజులపాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం 9.45 గంటలకు హోటల్ మౌర్యఇన్ విభు పంక్షన్ హాల్లో విలేకరుల సమావేశం లో మాట్లాడుతారు. అనంతరం విద్యావంతులు, మేధావుల సమావేశంలో పాల్గొంటారు.