న్యాయ వ్యవస్థకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సుందరరామశర్మ డిమాండు చేశారు. కోర్టులను కూడా మేనేజ్ చేయొచ్చంటూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుకు శవరాజకీయాలు చేయడం బాగా ఆలవాటు అయ్యిందని ధ్వజమెత్తారు. తీరు మార్చుకోకపోతే ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సుందరరామశర్మ మీడియాతో మాట్లాడారు.