చంద్రబాబుది అతి నీచమైన, దుర్మార్గమైన సంస్కృతి అని వైయస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. అలాంటి వ్యక్తితో రాజకీయాలు చేయడం మా దురదృష్టమని అన్నారు. విషపు రాతలతో ఒక పుస్తకాన్ని అచ్చెసి బయటకు వదిలారని, రాజకీయాల్లోకి ఆడవాళ్లను కూడా లాగి వివాదం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ పుస్తకంపై టీడీపీ, చంద్రబాబు పేర్లు పెట్టుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు ఓ పిరికిపంద అని దుయ్యబట్టారు.