ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజాస్వామ్య విలువలు కాపాడతారన్న నమ్మకముంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 12, 2023, 11:51 PM

ఏపీ నూతన గవర్నర్ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతారని నమ్మకం తమకు ఉందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఏపీ నూతన గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సయ్యద్ అబ్దుల్ నజీర్ నియమితులైన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఏపీ గవర్నర్ గా బాధ్యతలు అందుకోబోతున్న అబ్దుల్ నజీర్ గారికి హార్దిక శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. 


అబ్దుల్ నజీర్ చిత్తశుద్ధి, నిజాయతీ ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారని, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో కచ్చితంగా ఆయన ముందుంటారని భావిస్తున్నానని తెలిపారు. పదవిలో ఆయన విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com