ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, సచివాలయ కన్వీనర్లు, రాష్ట్ర కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సీఎం క్యాంపు ఆఫీసులో మధ్యాహ్నం 3 గంటలకు భేటీ ప్రారంభమవుతుంది. నిర్దేశిత ఫార్మాట్ లో గృహ సారథులుగా నియమితులైన వారి తుది జాబితాను తప్పనిసరిగా సమర్పించాలని అధిష్టానం సూచించింది.