ఏపీలోని భూముల రీసర్వే శరవేగంగా సాగుతోంది. మొత్తం 13,481 గ్రామాల్లో డ్రోన్ సర్వే చేయాల్సి ఉండగా, ఇప్పటికే 8,804 గ్రామాల్లో సర్వే పూర్తయింది. విస్తీర్ణపరంగా చూస్తే 1,12,000 చ.కి.మీలకు గాను 65,866 చ.కి.మీలోని వ్యవసాయ భూములు, గ్రామకంఠాల సర్వే పూర్తయింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి సర్వే పూర్తి చేయాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.