దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 30 పాయింట్లు కోల్పోయి 60,652 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ ట్రేడింగ్ 17,859 వద్ద ప్రారంభించింది. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, యూపీఎల్, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్డీఎఫ్సీ, కోల్ ఇండియా, విప్రో, ఇన్పోసిస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.72 వద్ద కొనసాగుతోంది.