వివేకా హత్య కేసులో సీఎం జగన్‌పై తెలుగుదేశం నేతలు చేస్తున్న ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. వివేకా చనిపోతే జగన్ కు ఏమైనా ఆస్తి వచ్చిందా ? అని కొడాలి నాని అడిగాడు. ఆస్తులన్నీ వివేకా భార్య, కూతురు, అల్లుడి పేర్లపైకి బదలాయించారని వివరించారు. వివేకా బతికి ఉంటే కూడా అవినాష్ రెడ్డికి సీటు ఇచ్చేవారని స్పష్టం చేశారు.వివేకా మృతితో వైసీపీకి ఎలాంటి లాభం లేదని స్పష్టం చేశారు. వివేకా చనిపోయే సమయానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నందున సీబీఐ విచారణ కోరినట్లు చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిష్పక్షపాతంగా విచారణ జరుపుతామని చెప్పినట్లు వివరించారు.