ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలోని ఒక గ్రామంలో సోమవారం జరిగిన ఆక్రమణల వ్యతిరేక డ్రైవ్‌లో ప్రమీలా దీక్షిత్ (45), ఆమె కుమార్తె నేహా (20) మృతిచెందారు. మైతా తహసీల్ ప్రాంతంలోని మదౌలి గ్రామంలో ఆక్రమిత స్థలాల్లో నిర్మాణాలను కూల్చి వేసేందుకు అధికారులు యత్నించారు. ఈ క్రమంలో ఓ ఇంటి పై కప్పునకు అధికారులు నిప్పు పెట్టారు. దీంతో ఆ ఇల్లు మొత్తం మంటల్లో చిక్కుకుంది. ఇంట్లో ఉన్న తల్లి, కుమార్తె మంటల్లో సజీవ దహనం అయ్యారు. దీంతో గ్రామస్తులు ఆగ్రహంతో అధికారులపై రాళ్లు రువ్వారు.అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కాన్పూర్ జోన్) అలోక్ సింగ్, డివిజనల్ కమిషనర్ రాజ్ శేఖర్‌తో కలిసి గ్రామాన్ని సందర్శించారు.