పచ్చి మిరపకాయలను సాధారణంగా కూరల్లో ఉపయోగిస్తారు. అయితే వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పచ్చిమిర్చి రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. పచ్చిమిర్చి తినడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉండి రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది.