దేశంలో ఆంధ్రప్రదేశ్ రైతులపైనే అత్యధిక రుణభారం ఉంది. జాతీయ స్థాయిలో సగటున ఒక్కో రైతు కుటుంబంపై రూ.74,121 అప్పు ఉంటే ఏపీలో సగటున రూ.2,45,554 చొప్పున ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భాగవత్ కరాడ్ సోమవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. దేశంలో రైతులు అత్యధిక రుణభారం మోస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, కేరళ, పంజాబ్‌లు టాప్-3లో ఉన్నాయి.