తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో శాంతి అనే మహిళ తల్లి, భర్త, కుమార్తె, మానసిక దివ్యాంగుడైన కుమారుడుతో కలిసి నివసిస్తుండేంది. కుమార్తెకు పెళ్లై వెళ్లిపోయాక వీరికి కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఇరుగుపొరుగు వాళ్లు ఏదైనా ఇస్తే తిని జీవించేవారు. ఈక్రమంలో ఆహారం లేక శాంతి తల్లి, భర్త వారం రోజుల కిందట మృతి చెందగా అంత్యక్రియలకు డబ్బులు లేక అలానే ఉంచేసింది. స్థానికుల ఫిర్యాదు మేర మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం అనంతరం ఖననం చేశారు.