పదిరోజుల కిందట టర్కీ, సిరియా సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించి వేలాదిమంది ప్రాణాలు తీసింది. భవన శిథిలాల కింద చిక్కుకున్న వారికోసం రెస్క్యూ టీమ్స్ అన్వేషిస్తున్నాయి. సహాయక బృందాల కొరతతో అనేక మృతదేహాలు శిథిలాల కిందే కుల్లిపోతున్నాయి. ఎక్కడ చూసిన హృదయ విధారక దృశ్యాలు మనసును మెలిపెడుతున్నాయి. సాయం కోసం అర్థిస్తూ కుటుంబీకుల మృతదేహాల కోసం వేలాదిమంది శిథిలాల వద్దే ఎదురుచూస్తున్నారు.