దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం సెన్సెక్స్ 188 పాయింట్ల లాభంతో 60,620 వద్ద, నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 17,813 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.60 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, TCS, ఎంఅండ్‌ఎం, HCLటెక్, టెక్ మహీంద్రా, విప్రో, ICICI బ్యాంక్, రిలయన్స్, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో ఉన్నాయి.