national | Suryaa Desk | Published :
Tue, Feb 14, 2023, 09:46 AM
రాజస్థాన్ కోటా జిల్లాలోని భావ్పురా నివాసి పంకజ్కు రావత్భటా నివాసి మధు రాఠోడ్తో శనివారం పెళ్లి జరగాల్సి ఉంది. సరిగ్గా వధువు వివాహ వేదికకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా మెట్లపై నుంచి జారిపడింది. ఆమె చేతులు విరిగి తలకు కూడా గాయాలవ్వటంతో ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం చెప్పేలోపే వరుడి కుటుంబం పెళ్లి మండపానికి బయలుదేరింది. దీంతో ఆస్పత్రిలోనే పెళ్లి చేయాలని నిర్ణయించారు. అక్కడే వధూవరులు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com