లావేరు: అప్పాపురం గ్రామ జంక్షన్ వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయ 11వ వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామికి తమలపాకులు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు జరిగాయి. వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నింటి సాయికుమార్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ లుకలాపు అప్పలనాయుడు, సోషల్ మీడియా మండల కన్వీనర్ రెడ్డి రమణ, మాజీ సర్పంచ్లు శివాంగం నాగరాజు, గొర్లె రామినాయుడు, పార్టీ నాయకులు జగ్గురోతు సత్యన్నారాయణ, యడ్ల మోహన్, మీసాల నారాయణరావు, పతివాడ గురునాయుడు, రెడ్డి రామారావు, అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. ఆలయం వద్ద మధ్యాహ్నం అన్నదానం చేశారు.