హొళగుంద మేజర్ గ్రామపంచాయతీలో ఈబిసి కాలనీ 6వ వార్డులో సర్పంచ్ చలవాది రంగమ్మ ఆధ్వర్యంలో సోమవారం పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్ దోమల బెడద తగ్గించడానికి జోరుగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. మేజర్ పంచాయతీ కార్యదర్శిమాట్లాడుతూ దోమల భారీన పడి వ్యాధులకి గురి అవుతున్న ప్రజల సంఖ్య నానాటికీ పెరుగుతుంది. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, బోదకాలు వంటివే కాకుండా అనేక రకాలైన ప్రాణాంతక వ్యాధులకు దోమలు కారణమ వుతున్నాయి. ఈ దోమల నిర్మూలనకై ప్రతిరోజు డ్రైనేజ్ పూడికలు తీసి, బ్లీచింగ్ పౌడర్ చల్లించి, ఫాగింగ్ చేస్తున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు మెంబర్ సుభాన్ పాల్గొన్నారు.