మచిలీపట్నం బలరాముని పేట లో ఉన్న ఆది వెలమ శ్రేయబివర్ధిని సంఘము కార్యాలయం వద్ద సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆర్థికంగా చదువులకు ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు విశాఖపట్నం నివాసి ఇమ్మానేని లక్ష్మీనారాయణ, సావిత్రి దంపతుల విద్యా నిధి నుంచి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న యువత విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 10, 000 లుచొప్పున మొత్తం రూ. 70 వేల రూపాయలు చెక్కు రూపంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు పిల్లారిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ “చదువుతో నాస్తి దుర్భిషం" ఆర్ధికంగా చదువులకు ఇబ్బందులు పడుతున్నా విద్యార్థులకు వారి చదువులు అగకుండ కొనసాగించాలనే ఉద్దేశ్యం తో ఉన్నత చదువులు భవిష్యత్తుకలో ఎంతో మంచి మేలు చేస్తాయని అటువంటి అది వెలమ కుటుంబ పిల్లలకు విశాఖపట్నం నివాసి ఇమ్మనేని లక్ష్మీ నారాయణ - సావిత్రి దంపతులు విద్యనిధి ప్రవేశపెట్టి గత 4 సంవత్సారాలు నుండి మచిలీపట్నం విద్యార్థులు కు ఉపకార వేతనాలు అందిస్తున్నారు. కావున విద్యార్థులు అందరూ చక్కగా చదువుకొని భవిష్యత్తులో ఉన్న శిఖరాలు చేరాలని ఆయన అన్నారు.