కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంగళవారం కృష్ణ యూనివర్సిటీ నందు విద్యార్థులు ధర్నా చేయడం జరిగింది. విద్యార్థుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని కృష్ణ డిస్ట్రిక్ట్ కలెక్టర్ రంజిత్ భాష కు బిజెపి నాయకులు వినతిపత్రం అందించారు.కృష్ణా జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి చదువుకోటానికి విద్యార్థులు నిత్యం వస్తున్నారు. కానీ యూనివర్సిటీ నందు వారికి హాస్టల్ వసతి లేకపోవడం వల్ల అడ్మిషన్లు తగ్గే అవకాశం ఉందని తెలిపారు.విద్యార్థుల సమస్యలు తక్షణం పరిష్కరించి హాస్టల్ వసతి ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు పాల్గొన్నారు.