వనపర్తి జిల్లా రాజీవ్ చౌరస్తా పట్టణంలోని రాజనగరం అయ్యప్ప స్వామి దేవాలయ ఆవరణలోని మరకత రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం నుంచి శివరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం నుంచి శనివారం వరకు ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగేష్, ముత్తు కృష్ణ గురుస్వామి తెలిపారు. ఉత్సవాలలో భాగంగా ప్రతీ రోజు భక్తులకు అన్నదానం చేస్తున్నట్లు వివరించారు. ఉత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.