నారా లోకేశ్ పాదయాత్ర చూసి జగన్ కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోకేశ్ పాదయాత్రతో వైసీపీలో వణుకు పుడుతోందన్నారు. పోలీసులు పెడుతున్న అర్థం పర్థం లేని నిబంధనలు జగన్ శాడిస్ట్ పాల నకు నిదర్శనమన్నారు. పాదయాత్రకు వచ్చే కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెట్టమని ఏ చట్టం చెప్పిందని, ప్రతి రోజూ పాదయాత్ర వివరాలు వీడియోలతో సహా ఇస్తుంటే పోలీసులు డ్రోన్ కెమెరాలను ఎందుకు ఎగుర వేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.