వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ నాయకులు మండిపడ్డారు. ధర్మవరం టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ ఆదేశాల మేరకు సోమవారం స్థానిక ప్రభుత్వాస్పత్రి వద్ద గల అన్నక్యాంటిన వద్ద పేదలకు అన్న దాన కార్యక్రమాన్ని చేపట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్నక్యాంటినలను మూసివేసి పేదల కడుపుకొట్టిందని విమర్శించారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనిని, వెంటనే అన్నక్యాంటినలను తిరిగి ప్రారంభించి పేదవారి కడుపునింపుతామన్నారు. టీడీపీనాయకులు పురుషోత్తంంగౌడ్, మిడతల యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.