బీజేపీ రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి జనసేన పార్టీతో కలసి రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ భీమవరం పట్టణ పార్టీ సమావేశంలో కార్యకర్తలకు వివరించారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కాగిత సురేంద్ర తెలిపారు. త్యాగరాజ భవనం మినీ హాల్లో సోవారం జరిగిన పట్టణ కార్యవర్గ సమావేశ వివరాలను పత్రికలకు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జనసేనతో కలసిపోటీ చేసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపిద్దామని పిలుపునిచ్చారు. పార్టీ కోసం పార్టీ శ్రేణులంతా ఐక్యమత్యంగా కష్టించి పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు కోమటి రవికుమార్, ఇంజేటి వేంకటేశ్వర్లు, షేక్ మొహిద్దీన్, వీవీఎస్ వర్మ, అల్లూరి సాయిదుర్గరాజు, పేరచర్ల వెంకట శ్రీనివాసరాజు (సుభాష్), వబిలిశెట్టి ప్రసాదరావు, అడబాల శివ, వీరమల్లు సుష్మ, కిర్లంపూడి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.