కైకలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పార్టీ ఫిరాయించారని రెండు రోజులుగా ప్రచారం సాగుతోం ది. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన టీడీపీపై అభాండాలు మోపుతూ, పార్టీ టిక్కెట్ ఇవ్వరేమోననే ఈ నిర్ణయమంటోన్న ఆయన వ్యాఖ్యలపై టీడీపీ నియోజకవర్గ, మండల నాయకులు, కార్యకర్తలు గుర్రుమంటున్నారు. పార్టీ లో చురుగ్గా వ్యవహరించలేకపోతున్న క్రమంలో మాజీ ఎమ్మెల్యే కొన్నాళ్లుగా అనారోగ్యంతో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీలోకి వెళుతున్న ఆయనకు ఎమ్మెల్సీ ఆఫర్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అటు నాయకులకు, ఇటు కార్యకర్తలకు అందుబాటులో లేరు. తాడేపల్లి ప్యాలెస్‌లో మిథున్‌రెడ్డి ఉండగా జయమంగళ జగన్‌ను కలిశారు. ఎమ్మెల్సీ ఇస్తున్నానని, జాగ్రత్తగా పనిచేయాలని ఆయనకు సూచించినట్లు తెలుస్తోంది. రాత్రికి నలుగురు గన్‌మెన్లతో ఇంటికి చేరుకున్నారని తెలుసుకున్న టీడీపీ నాయకులకు దీంతో ఒక స్పష్టత వచ్చింది. ఎపుడు వదిలించుకుందామా? అని ఎదురుచూస్తోన్న తరుణంలో తనంతట తానే బయటకు వెళ్లిపోవడంపై పార్టీ కార్యకర్తలు సం తోషం వ్యక్తం చేస్తున్నారు.