బెల్జియంలో వింకిల్ స్పోర్ట్స్ బి, వెస్ట్రోజెబ్కే మధ్య జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్ లో ఘోర విషాదం జరిగింది. వింకిల్ స్పోర్ట్స్ 2-1 గోల్స్ తో ఆధిక్యంలో ఉండగా చివర్లో వెస్ట్రోజెబ్కేకు పెనాల్టీ కార్నర్ లభించింది. దీన్ని వింకిల్స్ స్పోర్ట్స్ గోల్ కీపర్ ఆర్నే ఎస్పీల్ అద్భుతంగా ఆపాడు. అయితే, కొద్దిసేపటికే అతను మైదానంలో కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, హార్ట్ ఫెయిల్యూర్ తో చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.