కడప పాత రిమ్స్ ప్రాంగణంలోని ఆదరణ నిరాశ్రయుల వసతి గృహంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ జడ్జి కవిత మంగళవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. అనాథలు, అభాగ్యులు, భిక్షాటన చేసేవారు, రోడ్డు పక్కన, బస్టాండు, రైల్వేస్టేషన్, బహిరంగ ప్రదేశాల్లో నివసిస్తున్న వారి కోసం ప్రభుత్వం నిరాశ్రయుల వసతి గృహం ఏర్పాటు చేసిందన్నారు. ఉచిత న్యాయ సహాయం, న్యాయ, రక్షణ, సలహా వ్యవస్థల గురించి న్యాయమూర్తి వారికి వివరించారు.