మనకు కరోనా వైరస్ పరిచయం అయ్యాక మనం వినని వ్యాధులు, వైరస్ ల గురించి ఇపుడు వింటున్నాం. ఇదిలావుంటే ఈక్వటోరియల్ గినియాలో మార్‌బర్గ్ వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకూ 9 మంది మృతిచెందినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం ప్రకటించింది. చాలా ప్రమాదకరమైన ఈ వైరస్‌లోనూ ఎబోలా లక్షణాలుంటాయని పేర్కొంది. ఈ వైరస్ సోకినవారికి జ్వరంతో పాటు తరచుగా రక్తస్రావం జరగడం.. శరీర సామర్థ్యం తగ్గిపోతుంది. వైరస్ నివారణకు ప్రత్యేక వైద్య బృందాలను గినియాకు పంపినట్టు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
ఈ వైరస్ సోకిన రోగులకు అధిక జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ప్రాణాంతకమైన ఈ కొత్త వైరస్ వ్యాప్తి చెందిన ప్రావిన్సులను క్వారంటైన్ చేశామని ఈక్వటోరియల్ గినియా ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. ఆఫ్రికా మధ్య పశ్చిమ తీరంలో గాబన్, కామెరూన్ సరిహద్దులకు సమీపంలోని దట్టమైన అటవీ తూర్పు ప్రాంతంలో రక్తస్రావ జ్వరం అనుమానిత కేసులు వెలుగుచూసినట్లు ప్రభుత్వం గత వారం ప్రకటించింది. కీ-ఎన్‌టెమ్ ప్రావిన్సు పొరుగు జిల్లా మొంగోమోలో ఆరోగ్య ఎమర్జెన్సీ ప్రకటించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి మితోహా ఒండో అయేకాబా పేర్కొన్నారు. వైద్య బృందాలను ఈ ప్రాంతాల్లో ఇప్పటికే మోహరించి, అనుమానిత కేసులను గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు.
కీ-ఎన్‌టెమ్‌లో ఈ వైరస్‌కు ఇప్పటి వరకూ 4,325 మంది ప్రభావితమయ్యారని, జనవరి 7 నుంచి ఫిబ్రవరి 7 మధ్య 9 మంది మరణించారు. వీరి రక్త నమూనాల్లో మార్‌బర్గ్ వైరస్ నిర్ధారణ అయ్యింది. ఆఫ్రికాలో గతంలో ప్రబలిన ఎబోలాతో చాలామంది మరణించారు. ఎబోలా కొత్త రూపం మార్‌బర్గ్ ప్రబలుతుండటంతో డబ్ల్యూహెచ్ఓ హైఅలర్ట్ ప్రకటించింది. వైరస్ నియంత్రణ కోసం అంటువ్యాధి, కేస్ మేనేజ్‌మెంంట్, నియంత్రణ, ల్యాబొరేటరీ, రిస్క్ కమ్యూనికేషన్ నిపుణులను గినియాకు పంపినట్టు పేర్కొంది.
నమూనా పరీక్ష కోసం ల్యాబొరేటరీ గ్లోవ్ టెంట్‌లు, వైరల్ హెమరేజిక్ ఫీవర్ కిట్‌లు, పీపీఈ కిట్‌లను డబ్ల్యూహెచ్ఓ సమకూర్చింది. ‘‘మార్‌బర్గ్ తీవ్రమైన అంటువ్యాధి.. వ్యాధి నిర్ధారణలో ఈక్వటోరియల్ గినియా అధికారుల వేగవంతమైన, నిర్ణయాత్మక చర్యకు ధన్యవాదాలు.. అత్యవసర ప్రతిస్పందనతో త్వరగా నియంత్రించి తద్వారా మనం ప్రాణాలను కాపాడగలం.. వీలైనంత త్వరగా వైరస్‌ను కట్టడి చేస్తాం’’ డబ్ల్యూహెచ్ఓ ఆఫ్రికా రీజినల్ డైరెక్టర్ డాక్టర్ మట్షిడిసో చెప్పారు.
డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. మార్బర్గ్ వైరస్ మరణాల నిష్పత్తి 88 శాతం వరకు ఉంటుంది. ఇది ఎబోలా వైరస్ వ్యాధికి కారణమయ్యే వైరస్ కుటుంబానికి చెందింది. మార్‌బర్గ్ వైరస్ బారినపడ్డ వారిలో అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, తీవ్రమైన అనారోగ్యంతో అకస్మాత్తుగా ప్రారంభమతాయి. చాలా మంది రోగులు ఏడు రోజులలో తీవ్రమైన రక్తస్రావ లక్షణాలు వెలుగుచూస్తాయి.
ఈ వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. అలాగే, వైరస్ సోకినవారితో ప్రత్యక్ష సంబంధం, సన్నహితంగా మెలిగినా లేదా శరీర ద్రవాలు ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకు ఈ వైరస్‌ను అరికట్టే టీకాలు లేదా చికిత్సలు అందుబాటులోకి రాలేదు. అయినప్పటికీ, ప్రాణాపాయం నుంచి కాపాడే పలు విధానాలను ఉపయోగిస్తున్నారు. ఇమ్యూన్ థెరపీలు, ఔషధాలు, బ్లడ్ ప్రోడక్ట్స్, అలాగే క్లినికల్ దశలో ఉన్న వ్యాక్సిన్‌లతో చికిత్సలు కొనసాగిస్తుననారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa