ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమలలో జాతీయ స్థాయిలో ఒంగోలు, పుంగనూరు జాతి ఆవుల అందాల, పాల పోటీలు జరుగనున్నాయి. మార్చి 17న ప్రారంభంకానున్న ఈ పోటీలు మూడు రోజుల పాటు జరుగనున్నాయి. ద్వారకాతిరుమల మార్కెట్ యార్డ్‌లో పాల, అందాల పోటీలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒంగోలు, పుంగనూరు గోజాతి సంక్షేమ సంఘం, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, పశుగణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. పోటీల కోసం వచ్చే ఆవులు సేద తీరేందుకు పెద్దపెద్ద టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. పాల పోటీల కోసం, అలాగే అందాల పోటీల కోసం ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా పోటీదారులు పాల్గొనున్నారు. ఇవేకాక ప్రోత్సాహక బహుమతులు కూడా ఉన్నాయని నిర్వాహకుల కమిటీ చక్రపాణి, గోపి కాంత్ తెలిపారు.